Kesamudram: నర్మదా నది తీరంలో కేసముద్రం దేవాలయ కమిటీ స్వయంభూ శివలింగ సేకరణ!

Kesamudram: కేసముద్రం శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో కార్తీకమాస శివలింగ ప్రతిష్ఠాపనకు జబల్పూర్ నర్మదా నదిలో బ్రహ్మశ్రీ ప్రవీణ్ నంబూద్రి ఆధ్వర్యంలో స్వయంభూ శివలింగ సేకరణ.

A.Rajkumar, Mahabubabad
Published on: 5 Sept 2026 8:39 AM IST
Kesamudram
X

Kesamudram: నర్మదా నది తీరంలో కేసముద్రం దేవాలయ కమిటీ స్వయంభూ శివలింగ సేకరణ!

Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో కార్తీకమాసంలో శివలింగంప్రతిష్టించడం శివలింగాన్ని సేకరించడానికి దేవాలయ ప్రధాన తాంత్రి బ్రహ్మశ్రీ ప్రవీణ్ నంబూద్రి గారి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు ఈ నెల ఒకటో తారీఖున బయలుదేరి వెళ్లడం జరిగింది.

దానిలో భాగంగా ఈరోజు జబల్పూర్ పట్టణం బేదగడ్ దగ్గర ఉన్నటువంటి పవిత్ర నర్మదా నది తీరంలో దేవాలయ ప్రధానతాంత్రి చేతుల మీదుగా నది ప్రవాహం వలన స్వయంభుగా ఏర్పడినటువంటి శివలింగ రూపాన్ని సేకరణ ఈ సేకరణలో దేవాలయ కమిటీ సభ్యులు గురుస్వామి పోలేపల్లి యాకుబ్ రెడ్డి, బోగోజు నాగేశ్వర చారి, పెరుమాళ్ళ ఎల్లా గౌడ్, సతీష్, ఐలయ్య, బిచ్చు నాయక్, మధు, మల్సూర్, వీరన్న, రమేష్, బాలు యాత్రలో పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story