Mahabubabad: కురవి ప్రభుత్వ బడిలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఆదిత్య!
Mahabubabad: తన పుట్టినరోజు సందర్భంగా కురవి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య.
Mahabubabad: కురవి ప్రభుత్వ బడిలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఆదిత్య!
Mahabubabad: పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమంతో నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య ప్రారంభించారు.
తన పుట్టినరోజును పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ఆదిత్య ముచ్చటించారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిత్య మాట్లాడుతూ.. కురవి మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అదే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించడం మరింత సంతోషంగా ఉందన్నారు.
కురవి మండల ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, మండల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు కల్పించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు తన సహకారం కొనసాగిస్తానని పేర్కొన్నారు.




