Bhupalpally: కొయ్యూరు, మహాదేవపూర్ పీఎస్‌లలో డీఐజీ అంబర్ కిశోర్ ఝా తనిఖీలు

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు పీఎస్, మహాదేవపూర్ సీఐ కార్యాలయంలో కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా వార్షిక తనిఖీలు నిర్వహించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 20 Aug 2026 6:01 PM IST
Bhupalpally
X

Bhupalpally: కొయ్యూరు, మహాదేవపూర్ పీఎస్‌లలో డీఐజీ అంబర్ కిశోర్ ఝా తనిఖీలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం జోన్ డీఐజీ శ్రీ అంబర్ కిశోర్ ఝా, ఐపీఎస్ భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ మరియు మహాదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్,ఐపీఎస్ డీఐజీ కి ఘన స్వాగతం పలికారు.

తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్,సర్కిల్ కార్యాలయాల పరిశుభ్రత,రికార్డుల నిర్వహణ, ఆయుధాగారం,వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ,యూనిఫాం నిర్వహణ తదితర అంశాలను డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు.

పోలీస్ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధి నిర్వహణ,పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీటీవీ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించడంతో పాటు నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.

అదేవిధంగా డ్రగ్స్, గంజాయి,సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. మహిళలు, చిన్నారులు,వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సేవలందించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్,మహాదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story