Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో సెప్టెంబర్ 17న జాబ్ మేళా!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో సెప్టెంబర్ 17న జాబ్ మేళా. వీవీసీ గ్రూప్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో సెప్టెంబర్ 17న జాబ్ మేళా!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో VVC గ్రూప్ (హైదరాబాద్) మరియు ఫ్లిప్ కార్ట్ కంపెనీ (మహబూబాబాద్) లో పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు తేది: 17.09.2026 న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి.రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
VVC గ్రూప్, హైదరాబాద్ లో ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్, ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆటోమోటివ్ షో రూమ్ హోస్ట్, ఫ్లిప్ కార్ట్ మహబూబాబాద్ కంపెనీ లో డెలివరీ బాయ్స్ గా పనిచేయుటకు అభ్యర్థులు ఎస్.ఎస్.సి, ఐ.టి.ఐ, డిప్లమా, డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అర్హత, ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు తమ విద్యా అర్హతల సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్‌తో హాజరుకావాలని తేది.17.09.2026 న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం, రూమ్ నెంబర్ 25, రెండవ అంతస్తు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్), కురవి రోడ్, మహబూబాబాద్ నందు హాజరు కావాల్సిందిగా అధికారి ఈ సందర్బంగా పేర్కొన్నారు.




