Jangaon: వడ్లకొండ ఐకేపీ కేంద్రంలో రైతుల రాస్తారోకో

Jangaon: జనగామ మండలం వడ్లకొండ ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 16 May 2026 2:51 PM IST
Jangaon
X

Jangaon: వడ్లకొండ ఐకేపీ కేంద్రంలో రైతుల రాస్తారోకో

Jangaon: జనగామ మండలం వడ్లకొండ IKP కేంద్రంలో ధాన్యం అన్లోడ్ కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. కేంద్రానికి కేటాయించిన వీరభద్ర రైస్ మిల్లులో లారీలు ఖాళీ కాకపోవడంతో సుమారు 160 కుప్పల ధాన్యం నిలిచిపోయిందని, వర్షాలకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 'మాకు వీరభద్ర మిల్లు వద్దు' అంటూ రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో ఓ రైతు ఆవేదనతో అక్కడికి వచ్చిన CI కాళ్లపై పడి వేడుకోవడం అందరినీ కదిలిచింది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story