Jangaon: దేవరుప్పులలో ఝాన్సీరెడ్డి జన్మదిన వేడుకలు

Jangaon: జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఘనంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం నిర్వహణ.

S MAHENDER, PALAKURTHI
Published on: 18 Aug 2026 6:33 PM IST
Jangaon
X

Jangaon: దేవరుప్పులలో ఝాన్సీరెడ్డి జన్మదిన వేడుకలు

జనగామ: టిపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దావెర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు పాల్గొని రక్తదానం చేశారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కేకును కోసి,మిఠాయిలు పంచుకొని ఘనంగా ఝాన్సీరెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు కాసారాపు ధర్మారెడ్డి,మండల ఎస్సి,ఎస్టీ,బిసి సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు,భూక్యా సజ్జన్, కాడబోయిన గణేష్,మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్, మండల నాయకులు ఓడపెల్లి రవి, రెడ్దిరాజుల రమేష్,మోటికే చంద్రశేఖర్,జక్కుల గంగరాజు,రాంచందర్ నాయక్,సుధాకర్,సాగర్,యువజన నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story