Jangaon: జనగామలో ఉపాధ్యాయుల నిరసన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Jangaon: జనగామ జిల్లా బచన్నపేటలో USPC నిరసన. PRC, DA బకాయిలు, 317 జీవో సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్‌కు మెమొరాండం అందజేసిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు.
Jangaon: జనగామలో ఉపాధ్యాయుల నిరసన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
జనగామ: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జనగామ జిల్లా స్థాయి USPC ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ దశ పోరాటంలో భాగంగా బచన్నపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన అనంతరం తహసీల్దార్ ప్రకాష్ రావు గారికి మెమొరాండం అందజేయడం జరిగినది.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా USPC నాయకులు మహ్మద్ అంకుషావలి మాట్లాడుతూ, 2023 జూలై 1 నుండి పెండింగ్‌లో ఉన్న PRCను వెంటనే అమలు చేయాలని, 6 డీఏలను విడుదల చేయాలని, CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని, పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, గెస్ట్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, KGBV మరియు URS సమగ్ర శిక్షా, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం బేసిక్ పే అమలుచేయాలి , జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, విద్యారంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు
డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అనంతరం ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని USPC నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో TPTF TSUTF DTF సంఘాలు బాధ్యులు ఎండీ.అంకుషావలి K మల్లారెడ్డి యాకస్వామి శ్రీవాస్ రెడ్డి, జీవరత్నం, డి నరసింహ రెడ్డి శ్రీరామ్ గిరీషం ఆంజనేయులు రాజేందర్ రెడ్డి విజయలక్ష్మి మరియు లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.




