Jangaon: దేవరుప్పులలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

Jangaon: దేవరుప్పులలో అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్. రేషన్ విధానంలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.

S MAHENDER, PALAKURTHI
Published on: 12 Sept 2026 1:08 PM IST
Jangaon
X

Jangaon: దేవరుప్పులలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

Jangaon: దేవరుప్పుల మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని,రేషన్ సేవల్లో పారదర్శకత పెంచేందుకే రేవంత్ సర్కార్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తుందని,ఆధునిక భద్రతా లక్షణాలతో రూపొందించిన ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ వంటి సదుపాయాలు ఉండటంతో రేషన్ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని,అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను సక్రమంగా పరిశీలించుకోవాలని,గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్లక్ష్యం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేదల సంక్షేమం కోసం నూతన రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తోందని,ప్రజా పాలన ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్ర కోమలత,కార్యదర్శి సతీష్,వార్డు సభ్యులు చిలుకూరి నర్సయ్య, గోడిశాల శ్రీనివాస్,కారుపోతుల సందీప్,రమేష్,కారోబార్ వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI