Jangaon: జనగామ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో సేజ్ స్కూల్ జయకేతనం

Jangaon: జనగామ సేజ్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి చెస్ పోటీల్లో సత్తా చాటారు. వివిధ విభాగాల్లో బహుమతులు గెలుచుకుని పాఠశాలకు కీర్తి తెచ్చిన విద్యార్థులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 July 2026 5:18 PM IST
Jangaon
X

Jangaon: జనగామ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో సేజ్ స్కూల్ జయకేతనం

జనగామ: జనగాం పట్టణంలోని సేజ్ హై స్కూల్ మరోసారి చెస్‌లో తన ప్రత్యేకతను చాటుకుంది క్వెస్ట్ మిత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు వివిధ వయో విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పలు బహుమతులను కైవసం చేసుకుని పాఠశాలకు కీర్తి తీసుకొచ్చారు.

అండర్–7 విభాగంలో అద్వైత్ రావు ప్రథమ స్థానం వై. అశ్విక్ ద్వితీయ స్థానం లహన తృతీయ స్థానం సాధించారు.

అండర్–9 విభాగంలో రేమానిక రెడ్డి ప్రథమ స్థానం హిరణ్య ద్వితీయ స్థానం, హార్దిక్ తృతీయ స్థానం సాధించారు.

అండర్–11 విభాగంలో వై. చాణక్య ప్రథమ స్థానం శ్రీహిత్ ద్వితీయ స్థానం హార్దిక్ తృతీయ స్థానం దక్కించుకున్నారు.

అండర్–13 విభాగంలో పి. అభినవ్ ప్రథమ స్థానం కే. సహస్ర ద్వితీయ స్థానం జే. మహిత్ తృతీయ స్థానం సాధించారు.

అండర్–15 విభాగంలో ఎం. క్రిష్ బాబు ప్రథమ స్థానం బీ. చియాన్ ద్వితీయ స్థానం సూర్యతేజ తృతీయ స్థానం సాధించారు.

ఈ సందర్భంగా సేజ్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ వాదిరెడ్డి రోహన్ రెడ్డి మాట్లాడుతూ చెస్ అనేది విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపకశక్తి విశ్లేషణాత్మక ఆలోచన వ్యూహాత్మక ప్రణాళిక, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే అత్యుత్తమ మేధోక్రీడ అని అన్నారు. చెస్‌ను చిన్ననాటి నుంచే అలవర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఓర్పు, క్రమశిక్షణ నిర్ణయ సామర్థ్యం పెంపొందడంతో పాటు విద్యా ప్రగతికీ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ జిల్లా స్థాయి చెస్ పోటీలకు ఎండబట్ల మధు నిర్వాహకుడిగా వ్యవహరించగా బొమ్మ వీరస్వామి ఎండి అబ్బాస్ మియా ఏ. నర్సింగరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. అలాగే దామెర ప్రేమ్ సాగర్ కె.రాము ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అభినందనలు తెలియజేసి బహుమతులు అందజేశారు.

ఈ విజయాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు అభినందిస్తూ భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి సేజ్ హై స్కూల్‌కు మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజేతల తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తామని కరస్పాండెంట్ తెలిపారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story