Jangaon: జనగామలో విషాదం అడవి పందిని ఢీకొని నవవరుడు దుర్మరణం!

Jangaon: జనగామ సమీపంలో అడవి పందిని ఢీకొని ద్విచక్రవాహన ప్రమాదంలో కన్నెబోయిన ప్రవీణ్ మృతి. రెండు నెలల క్రితమే పెళ్లయిన నవవరుడు మృతితో గ్రామంలో విషాదం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 30 Aug 2026 12:37 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో విషాదం అడవి పందిని ఢీకొని నవవరుడు దుర్మరణం!

Jangaon: ​రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి జనగామ సమీపంలో అడవి పంది అడ్డురావడంతో జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో గానుగుపహాడ్ గ్రామానికి చెందిన కన్నెబోయిన ప్రవీణ్ (24) దుర్మరణం చెందాడు ​ఏం జరిగింది ఈ నెల 27న పనుల నిమిత్తం వెల్దండకు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా, వెంకిర్యాల శివారు వద్ద అకస్మాత్తుగా అడవి పంది అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

​ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు ​కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం మృతుడు ప్రవీణ్‌కు కేవలం రెండు నెలల క్రితమే వివాహం జరగడంతో, అతని అకాల మరణంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గానుగుపహాడ్‌లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story