Bachannapet: బచ్చన్నపేట భారీ చోరీ కేసును ఛేదించిన జనగామ పోలీసులు!
Bachannapet: జనగామ జిల్లా బచ్చన్నపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. ముగ్గురి అరెస్ట్.. 15.50 లక్షల విలువైన బంగారం, వెండి, బైక్‌లు స్వాధీనం.
Bachannapet: బచ్చన్నపేట భారీ చోరీ కేసును ఛేదించిన జనగామ పోలీసులు!
Bachannapet: బచ్చన్నపేటలో జరిగిన భారీ చోరీ కేసును చెధించిన పోలీసులు...
ముగ్గురు దొంగలు అరెస్టు,చేసి నిందితుల నుండి రూ.15.50 లక్షల సొత్తు స్వాధీనం.
జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలోని దొంతుల సోమలింగం ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన జనగామ పోలీసులు.
జనగామ పోలీస్ స్టేషన్లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టిన
ACP భీమ్ శర్మ.
నిందితుల నుండి 8 తులాల బంగారం,1475 గ్రాముల వెండి 3 మోటార్ సైకిళ్లు 15,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడి తో పాటు మరో ఇద్దరు జువైనల్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడి పై ఇప్పటికే సుమారు 40 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నయి.
జైలు నుండి విడుదలైన తర్వాత ఇద్దరు జువైనల్స్‌ను ప్రలోభపెట్టి చోరీలకు పాల్పడుతున్నాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ప్రజలు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలీ.
ఊరెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.




