Devruppula: దేవరుప్పుల కేజీబీవీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Devruppula: దేవరుప్పుల కేజీబీవీలో రూ.38 లక్షలతో అదనపు గదులు, శానిటేషన్ పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 3 Sept 2026 7:23 PM IST
Devruppula
X

Devruppula: దేవరుప్పుల కేజీబీవీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

దేవరుప్పుల: దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో రూ.38 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, శానిటేషన్ మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణంతో విద్యార్థినులకు మరింత సౌకర్యవంతమైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

అదేవిధంగా విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ టాయిలెట్లు, శానిటేషన్ సౌకర్యాల అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఆడబిడ్డల విద్యకు పెట్టే ప్రతి రూపాయి వారి భవిష్యత్తుకు పెట్టుబడేనని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థినులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. KGBV పాఠశాల అభివృద్ధికి అవసరమైన మరిన్ని సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story