Jangaon: కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు - ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Jangaon: దేవరుప్పులలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు.
Jangaon: కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు - ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జనగామ జిల్లా: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దేవరుప్పుల మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించి టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమే ఈ 1000 రోజుల పాలన అని,ముందు రాబోయే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలలో గెలిచి బిఆర్ఎస్ పార్టీకి ఘాటుగా సమాధానం చెప్పాలని,దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని,ప్రజా ప్రభుత్వం వచ్చిన కానుండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు,
ఎమ్మెల్యేలు ప్రజా క్షేత్రంలో అనునిత్యం ప్రజలకోసం పని చేస్తున్నామని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని,మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇళ్ల పథకం,రైతులకు రైతు భరోసా,పంట రుణమాఫీ,మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,యువతకు ఉపాధి,విద్యా అవకాశాలు కల్పించడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని,అసలైన నిరుపేదలకు ఇదిరమ్మ ఇండ్లు ఇచ్చామని,ప్రజలపై ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని,గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో
పెట్టిందని,రైతాంగం,మహిళలు,దళితులు,గిరిజనులు,బీసీలు,మైనార్టీలు,యువత అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని,కాళేశ్వరం కులేశ్వరం లాంటి దోచుకునే ప్రాజెక్టుల మీద కాదు దృష్టిపెట్టింది రైతులకు లాభం చేకూరెలా పాలకుర్తి,చెన్నూరు రిజర్యాయర్ల నుండి 77వేల ఎకరాలకు సాగునీరును అందించేందుకు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని,రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాసారపు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ,దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణ మూర్తి గౌడ్,మాజీ మండల అధ్యక్షుడు ఉప్పుల సురేష్ బాబు,ఎస్టీ,ఎస్సి,బిసి,మైనారిటీ అధ్యక్షులు భూక్యా సజ్జన్, ఇనుముల నాగరాజు, కాడబోయిన గణేష్, మహ్మద్ రసూల్,మండల యూత్ అధ్యక్షుడు పులుగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,NSUI మండల అధ్యక్షుడు కొంగరి ఉమేష్,మండల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు,యువజన నాయకులు,ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు,మహిళా కాంగ్రెస్ నాసుకురాళ్లు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




