Jangaon: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Jangaon: జనగామ జిల్లా లింగాల ఘనపూర్ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Jangaon: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ: లింగాల ఘనపూర్ మండల విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.
సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఋణమాఫీ వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.
కార్యకర్తలే అసలైన బలం గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. BRS పై ఘాటు విమర్శలు కవిత చేసిన అవినీతి ఆరోపణలకు BRS నాయకులు ముందు సమాధానం చెప్పాలి. గతంలో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వంపై విషప్రచారాలు చేస్తున్నారు.
BJP నైజం బయటపడింది గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కానీ, 1000 కోట్ల నిధులు కానీ ఇవ్వలేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే సీన్ బీజేపీకి లేదు. పార్టీ క్రమశిక్షణ ముఖ్యం పాత, కొత్త బేధాలు పక్కన పెట్టి పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే వారికే నా దగ్గర గౌరవం ఉంటుంది.
మండల అభివృద్ధికి హామీ లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతి గ్రామానికి రెండు పంటలకు సాగునీరు అందిస్తా. జీడికల్ రోడ్డు నిర్మాణంతో పాటు కోడూరు, కన్నాయిపల్లి, చీటూరు రోడ్లను త్వరలోనే పూర్తి చేయిస్తా. సామాజిక బాధ్యత గ్రామాల్లో బెల్ట్ షాపులను నిషేధించి, గంజాయికి యువత బలికాకుండా గ్రామసభల్లో తీర్మానాలు చేయాలి.
హాజరైన ప్రముఖులు:
జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందిరా, ఉపాధ్యక్షులు గుడి వంశీధర్ రెడ్డి, కిసర దిలీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివ కుమార్, మండల అధ్యక్షుడు సాధం విజయ్ మనోహర్, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.




