Jangaon: ఎంపీ అరవింద్‌పై ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తీవ్ర ఆగ్రహం!

Jangaon: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌పై విమర్శలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఆగ్రహం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 16 Aug 2026 11:23 AM IST
Jangaon
X

Jangaon: ఎంపీ అరవింద్‌పై ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తీవ్ర ఆగ్రహం!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు మీడియా సమావేశం.ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య కామెంట్స్, బీజేపీ ఎంపీ అరవింద్ మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, గుండు ఆరవింద్ నీ నీచపు రాజకీయ కుటుంబం చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియదా, మీ నానమ్మ బీడీలు చేసి మిమ్మల్ని సాదిందని మీ నాన్న డీఎస్ సే ఇంటర్వ్యూలో చెప్పారు.

అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు నేడు వేల కోట్ల రూపాయల అధిపతులు ఎలా అయ్యారు? కోట్ల రూపాయల అద్దెలు వచ్చే ఆస్తులు ఎలా సంపాదించారు... ఒక బీసీ నాయకుడిపై సభ్యత, సంస్కారం లేకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం గుండు ఆరవింద్ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం,గతంలో డీఎస్ పీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో బీ-ఫామ్‌లకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్న చరిత్ర కాంగ్రెస్ నాయకులకు తెలుసు.

నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. అదే ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధిగా గుండు ఆరవింద్ మహేష్ కుమార్ గౌడ్ ను గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు వ్యక్తిగత రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.హిందూ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు వ్యక్తిగత దూషణలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించడ అదేం సంస్కారం.మేము మీలాగా వ్యక్తిగతంగా మాట్లాడితే బీజేపీ నాయకులు రోడ్ల మీద తిరగగలరా అధికారం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు ప్రజలే అంతిమ నిర్ణేతలు.

కాబట్టి అహంకారం వీడి హుందాగా రాజకీయాలు చేయాలి...పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు గుండు ఆరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story