Jangaon: నెలన్నరగా మార్కెట్లోనే ధాన్యపు కుప్పలు.. రైతుల కన్నీరు!

Jangaon: జనగామ వ్యవసాయ మార్కెట్‌లోని ఐకేపీ కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం నేతలు తీగల సాగర్, మూడ్ శోభన్ సందర్శించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 23 May 2026 3:40 PM IST
Jangaon
X

Jangaon: నెలన్నరగా మార్కెట్లోనే ధాన్యపు కుప్పలు.. రైతుల కన్నీరు!

Jangaon: జనగామ వ్యవసాయ మార్కెట్ లోని ఐకెపి సెంటర్ సందర్శించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్.. జనగామలో ధాన్యం కొనుగోలు లేకపోవడంతో రైతుల ఇబ్బందులు.

రైతుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని అటు రాష్ట్ర మంత్రి తో పాటు ముఖ్య మంత్రి పేర్కొంటున్నప్పటికీ వాస్తవాలు మరో విధంగా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా జనగాం మార్కెట్ యార్డులో శనివారం పర్యటించినప్పుడు నెల 15 రోజుల నుండి కొనుగోలు లేక ధాన్యాన్ని మార్కెట్లోనే కుప్పలుగా పోసి నిరీక్షిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారని దీనికి ఏం సమాధానం చెప్తానంటూ రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ధాన్యం తరలించడానికి సకాలంలో లారీలు పంపించడం లేదని తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతు బాధలను వినే నాథుడే లేడని ఆయన వాపోయారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story