Jangaon: విద్యార్థులకు బూట్లు, సాక్సులు అందజేత లయన్స్ క్లబ్
Jangaon: జనగామ జిల్లా శామీర్‌పేట జెడ్పీ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 60 మంది విద్యార్థులకు బూట్లు, సాక్సులు పంపిణీ. పాల్గొన్న ప్రముఖులు.
Jangaon: విద్యార్థులకు బూట్లు, సాక్సులు అందజేత లయన్స్ క్లబ్
జనగామ: లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ దత్తత పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్ శామీర్పేట్ లో ఈ రోజు నాడు పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కొత్తపల్లి జాన్ బన్నీ గారి పుట్టిన రోజు సందర్భంగా 60 మంది పిల్లల కు బూట్లు సాక్స్25,000/-విలువ) వితరణ చేశారు ఈ సందర్భంగా హెడ్మాస్టర్ కె మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వక్తలు విశ్రాంత లెక్చరర్లు అంచూరి రమేశ్ డా. జి. సీతారాం మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో శ్రద్ధగాయ్ఛదవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదవి ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురి పేర్లను ఉటంకిస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు ఈ సేవా కార్యక్రమానికి అమెరికా కొలంబస్ లో ఉన్న మా క్లబ్ శ్రేయోభిలాషి శ్రీ ముమ్మిడిశెట్టి సుభాష్ చంద్ర ఆర్థిక సహాయం చేశారని కార్యదర్శి రేణుకుంట కృష్ణ తెలిపారు.
కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వనమాల సోమయ్య మాజీ జిల్లా గవర్నర్ కన్నా పరశు రాములు మాట్లాడుతూ వసతులతో పాటు ప్రతినెల ఒక ఆరోగ్య శిబిరం నిర్వహించి పండ్లు కళ్ళు చర్మ సంబంధాలకు చెందిన ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జి ఎం టి జిల్లా కోఆర్డినేటర్ ఏ బిక్షపతి క్లబ్ పూర్వ అధ్యక్షులు సభ్యులు నాగబండి రవీందర్ డా. జి. సీతారాం బచ్చు రమేష్ అల్లాడి మహేశ్వర్రావు తాళ్ళ వెంకట మల్లా రెడ్డి యామసాని శ్రీనివాసు దిడిగం ఆంజనేయులు పాఠశాల ప్రధానో పాధ్యాయుడు కె. మధుసూదన్ రెడ్డి ఉపాధ్యాయులు టి . నీరజ, కె. పద్మజ డి. శారద వై. వజ్రయ్య టి. శ్రీనివాస్ పి. క్రాంతి జి. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.




