Jangaon: రేపటి సమాజ మార్గదర్శకులు టీచర్లే: లయన్స్ జిల్లా గవర్నర్ నరహరి!

Jangaon: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 88 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 6 Sept 2026 7:13 PM IST
Jangaon
X

Jangaon: రేపటి సమాజ మార్గదర్శకులు టీచర్లే: లయన్స్ జిల్లా గవర్నర్ నరహరి!

జనగామ సెప్టెంబర్ 6: రేపటి పౌరులైన నేటి విద్యార్థులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులు రేపటి సమాజ మార్గదర్శకులని లయన్స్ ఇంటర్నేషనల్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం జనగామలో వైభవంగా జరిగిన ఉపాధ్యాయుల సన్మానోతవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

టీచర్స్ హానరింగ్ జిల్లా చైర్మన్ లయన్ చందుపట్ల రవీందర్ రెడ్డి అధ్యక్షతన గురుపూజోత్సవ వేడుకలో జిల్లా గవర్నర్ మాట్లాడుతూ లయన్స్ సంస్థ సాంప్రదాయం ప్రకారం నిర్వహించే కార్యక్రమాలలో టీచర్స్ డే ఒకటని అన్నారు. మనదేశ తొలి ఉపరాష్ట్రపతి, మలి రాష్ట్రపతిగా సేవలందించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా గురువులను సన్మానించుకొంటూ వారి ఆదర్శాలను గుర్తు చేసుకోవడం మనకు స్పూర్తి అని అన్నారు.

ఈ సందర్భంగా అవిభక్త వరంగల్ రెవెన్యూ జిల్లా పరిధిలో గల 76 లయన్స్ క్లబ్ ల పక్షాన 88 మంది టీచర్లను సన్మానించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ధృవ పత్రాలు మెమంటోస్ ప్రదానం చేశారు. ఉపాధ్యాయులను అభినదీస్తూ మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డా చంద్రశేఖర్ ఆర్య, సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ రేవూరి రమణారెడ్డి, పూర్వ జిల్లా గవర్నర్లు కన్న పరశురాములు, ముచ్చ రాజిరెడ్డి, టి. లక్ష్మీనరసింహ రావు ప్రసంగించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ కార్యదర్శి పాము శ్రీనివాస్, కోశాధికారి చొప్పరి సోమయ్య, గ్లోబల్ యాక్షన్ టీం నాయకులు, చంద్రగిరి ప్రసాద్, వి. శారద, టి. వెంకట్ రెడ్డి, రీజియన్ చైర్మన్ లు జైన రమేశ్, బిల్లా సులోచన, ఎస్. నాగవాణి, జిల్లా నాయకులు దడిగల రమేష్, టి. నరేందర్, పి. వేణుమాధవ్ రావు, కుర్రెముల యాదగిరి, అల్లాడి ప్రభాకర్ రావు, పబ్బ చంద్రశేఖర్, హోస్ట్ క్లబ్ జనగామ జనగామ సూర్య అధ్యక్షుడు నాగంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి బత్తిని శ్రీనివాస్, కోశాధికారి పానుగంటి యాదగిరి, సిహెచ్. జయలత, బానోత్ రవినాయక్, నల్ల యాదగిరి, వివిధ క్లబ్‌ ల అధ్యక్షులు , కార్యదర్శులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story