Jangaon: జనగామలో ఆర్టీసీ బస్సు చోరీ!

Jangaon: జనగామలో మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును దొంగిలించిన వ్యక్తి. 21 కిలోమీటర్లు ప్రయాణించి దేవరుప్పుల సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద ప్రమాదం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 10 July 2026 9:35 AM IST
Jangaon
X

Jangaon: జనగామలో ఆర్టీసీ బస్సు చోరీ!

Jangaon: జనగామలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సుతో ఉడాయించిన సం ఘటన జనగామ జిల్లాకేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరి గింది. వివరాల్లోకెలితే... పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన జిట్టబోయిన వెంకన్న డోజర్ డ్రైవ ర్గా పనిచేస్తున్నాడు.

కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో నుంచి జనగామకు బుధవారం వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటలకు ట్రిప్ ముగించుకొని వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సును డ్రైవర్ జనగామ బస్టాండ్లో లో ఆవరణలోని పార్కింగ్లో నిలిపి ఇంటికి వెళ్లాడు. బస్టాండ్ ఆవరణ కావడంతో బస్సు తాళాలను డ్రైవర్ అలాగే ఉంచి వెళ్లాడు.

అనంతరం మద్యం మత్తులో ఉన్న వెంకన్న గురువారం తెల్లవారుజామున 3 గంటలకు బస్సును స్టార్ట్ చేసుకొని సూర్యాపేట మీదుగా వెళ్లాడు. ఈ క్రమంలో 21 కిలోమీటర్లు ప్రయాణించి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొన్నాడు. దీంతో గమనించి న టోల్ గేట్ సిబ్బంది ఆరా తీయగా వెంకన్న పరిస్థితిని గమనించి దేవరుప్పు ల పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల ఆరా తీయగా మద్యం మత్తులో బస్సును తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో బస్సును, వెంకన్నను జన గామ పోలీసులకు అప్పగించారు. కాగా.. దీనిపై అద్దె బస్సు యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సత్య నారాయణరెడ్డి తెలిపారు. మద్యం మత్తు, మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవ డంతోనే బస్సును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story