Jangaon: జనగామలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా.. సెప్టెంబర్ 5న ప్రక్రియ
Jangaon: జనగామ అర్బన్ పరిధిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ చేపట్టనున్నారు.
Jangaon: జనగామలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా.. సెప్టెంబర్ 5న ప్రక్రియ
Jangaon: జనగాం మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 5,081 మంది లబ్ధిదారులలో 174 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపునకు డ్రా (లాటరీ) నిర్వహించబడుతుంది.
ఈ మేరకు సంబంధిత లబ్ధిదారుల జాబితాను జనగాం మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రదర్శించడం జరిగింది.
కావున డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో తమ పేరును పరిశీలించుకోవలసిందిగా తెలియజేయడమైనది.
*డ్రా నిర్వహించు ప్రదేశం *
తేదీ : 05-09-2026 | సమయం : ఉదయం 09:00 గంటలకు
వేదిక : జనగాం కలెక్టరేట్ కార్యాలయం
కావున సంబంధిత లబ్ధిదారులు నిర్ణీత సమయానికి హాజరై డ్రా ప్రక్రియలో పాల్గొనవలసిందిగా తెలియజేయడమైనది.
ఇట్లు
-తహసీల్దార్ కార్యాలయం,
-జనగామ
Next Story




