Jangaon: జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

Jangaon: జనగామలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలని సీపీఎం ధర్నా. వినతిపత్రం స్వీకరించని కలెక్టర్ తీరుపై గేట్ వద్దే మెమోరాండం అందజేత.

MD AHMAD PASHA, JANGAON
Published on: 22 July 2026 6:44 PM IST
Jangaon
X

Jangaon: జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

జనగామ జిల్లా: జనగామ దేశాభివృద్ధిలో వ్యవసాయ విద్య వైద్య రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ రంగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసి ప్రభుత్వ రంగంలో బలోపేతం చేసి కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.

ఈరోజు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలు వైద్య ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు జిల్లాలో ప్రైవేటు విద్యాలయాలు కళాశాలలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసి పేద మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు అర్హత లేకున్నా డీజీ టెక్నో రకరకాల పేర్లతో మాయమాటలు చెప్పి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రైవేటు ఆసుపత్రులలో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఇఫ్తారీతిన వైద్యం చేస్తున్నారని దీనిపై నియంత్రణ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జనగామ జిల్లా పూర్తిస్థాయిలో వ్యవసాయంపై ఆధారపడ్డ వ్యవసాయక జిల్లా అని వ్యవసాయాన్నిఅభివృద్ధి చేయడం కోసం ఎలాంటి ప్రణాళికలు లేవని రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావడంలేదని మార్కెట్ దళారీల దోపిడీ విపరీతంగా ఉందని అన్నారు.

జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున కరువు ఛాయాలలో జిల్లా వ్యవసాయ రంగం ఉన్నదని రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తక్షణం పంట రుణాలు అందించాలి అలాగే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకారులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.అలాగే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి అవసరమగు విత్తనాలను ప్రభుత్వం రైతాంగానికి ఉచితంగా అందించాలని తెలిపారు

ధర్నా అనంతరం గత రెండు నెలలుగా జనగామ జిల్లా వ్యాప్తంగా విద్య వైద్యం వ్యవసాయ రంగాలపై నిర్వహించిన సర్వేలలో వచ్చిన అంశాలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలిసి వినతి పత్రం ఇవ్వడం కోసం సిపిఎం జిల్లా ప్రతినిధి బృందం వెళ్లగా కనీసం సమయం ఇవ్వకుండా మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలను గౌరవించకుండా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపి కలెక్టరేట్ కార్యాలయ గేట్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది.

ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి జోగు ప్రకాష్ సుంచు విజయేందర్ పొత్కనూరి ఉపేందర్ బెల్లంకొండ వెంకటేష్ చిట్యాల సోమన్న గంగాపురం మహేందర్ గుండెబోయిన రాజు మాచర్ల సారయ్య తోటి దేవదానం ఇంటి వెంకటరెడ్డి పర్వతం నరసింహులు పల్లెర్ల లలిత దాసగాని సుమా పాముకుంట్ల రేణుక హజ్మీరా సురేష్ ఏదునూరి మదర్ గండి అంజయ్య పోలాస్ పరమేష్ సోమసత్యం పొదల నాగరాజు గోసంగి శంకరయ్య బూడిద ప్రశాంత్ వంగ పండు సోమయ్య ఇంజ ఎల్లయ్య కాసాని తదితరులు పాల్గొన్నారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story