Palakurthi: చెన్నూరు - మంచుప్పుల రోడ్డుకు వెంటనే డాంబర్ వేయాలి
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు నుండి మంచుప్పులకు వెళ్లే కంకర రోడ్డును పరిశీలించిన సీపీఎం నాయకులు. వెంటనే బీటీ రోడ్డు వేయాలని డిమాండ్.
Palakurthi: చెన్నూరు - మంచుప్పుల రోడ్డుకు వెంటనే డాంబర్ వేయాలి
పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో చెన్నూరు నుండి మంచుప్పుల గ్రామానికి వెళ్లే పంచాయతీ రోడ్డుకు కంకర పోసిండ్రు గాని డాంబరు వేయుట మర్చిపోయారని సిపి( ఐ) ఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న అన్నారు.
శుక్రవారం పాలకుర్తి మండలం లోని చెన్నూరు నుండి మంచుప్పులకు వెళ్లే రహదారి కంకర రోడ్డును సిపి (ఐ) ఎం ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ చెన్నూరు మంచ్చుప్పుల రోడ్డుకు కంకర పరచి సుమారుగా మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డాంబర్ వేయడంలో పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు . నిత్యం రోడ్డు వెంట టూవీలర్ వెహికల్లు, ఆటోలు మీద వెళ్లే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రజలు నిత్యం పాలకుర్తి మండలానికి తమ అవసరాలకు గురించి నిత్యవసర సరుకులు కొనుగోలు చేయుటకు రోడ్ గుండా రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పాలకులు మాత్రం రోడ్డు సమస్యను చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కంకర తేలిన గుంతల రోడ్డు వెంట రాత్రిపూట బండ్లు రావాలంటే ఎక్కడ ప్రమాదం గురి అవుతావో ఏమోనని , ఎక్కడ ప్రమాదం జరుగుతుందని భయం తో ప్రయాణిస్తున్నామని ప్రయాణికులు తెలిపారు అన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక రోడ్డును అభివృద్ధి పరచకుండా నిర్లక్ష్యం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని వారు ప్రశ్నించారు.
ఇప్పటికైనా కంకర తేలిన గుంతల రోడ్డుకు వెంటనే బిటి రోడ్డు వేయాలని లేనియెడల సిపి( ఐ)ఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బచ్చు శ్రీలత, కాకర్ల బాబు, పెండ్లి భాస్కర్, కే. పద్మ, కే. సోమక్క, ఈ. లచ్చమ్మ, కే. గౌతమి, కే. వెన్నెల, కే. మైసమ్మ తదితరులు పాల్గొన్నారు.




