Jangaon: జనగామ నిరుద్యోగ సమస్యపై ఆగస్టు 20న కలెక్టరేట్ ధర్నా – CPM
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సిపిఎం సమావేశం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సింగారపు రమేష్ డిమాండ్.
Jangaon: జనగామ నిరుద్యోగ సమస్యపై ఆగస్టు 20న కలెక్టరేట్ ధర్నా – CPM
జనగామ: దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేష్ అన్నారు.బుధవారం పాలకుర్తి మండలం,మంచుప్పుల గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పన్మాటింటి ఐలయ్య, కాకర్ల పద్మ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించిన వారికి నిరుద్యోగ కోరల్లో చిక్కిన యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని,2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 12 సంవత్సరాలు గడిచిన ఉద్యోగాలు కల్పించకుండా మాయమాటలు చెబుతూ యువతను మోసం చేస్తుందని,మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప కొత్త రిక్రూట్ లేవని,ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం
చేస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాల భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని,రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 9000 మంది పదవీ విరమణ పొందుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,యువతి యువకులు లక్షల రూపాయలు ఖర్చు చేసి
కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వమ్ము చేశాయని,ఈనెల 20న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని,సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో యువతి యువకులు నిరుద్యోగులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, మండల కమిటీ సభ్యులు సోమసత్యం, ఏదునూరి మదార్, బాణాల వెంకన్న, కాకర్ల బాబు, ఈ విజేందర్, జి లక్ష్మి, కే ఎల్లమ్మ, కే బాబు,బి రేణుక, కే మాధవి, ఏం యాకలక్ష్మి, పి యాదమ్మ, జి సోమలక్ష్మి, సోమయ్య, సోమ నర్సయ్య, బిక్షపతి, ప్రవీణ్, చంద్రయ్య, వెంకన్న,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




