Jangaon: పాలకుర్తి బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం డిమాండ్
Jangaon: పాలకుర్తి బస్టాండ్‌లో తాగునీరు, రోడ్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బట్లపై సీపీఎం నాయకులు చిట్యాల సోమన్న, మాచర్ల సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Jangaon: పాలకుర్తి బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం డిమాండ్
జనగామ: పాలకుర్తి బస్టాండ్ లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో పాలకుర్తి బస్టాండ్ ఉన్న సందర్శించి గుంతలుగా ఉన్న రోడ్డులను పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా పాలకుర్తి బస్టాండు పరిస్థితి ఉందని,బస్టాండ్ లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని,బస్సులు నిలిపే ప్రదేశంలో రోడ్లు పూర్తిగా గుంతల మాయంగా మారాయని,వర్షాకాలంలో బస్సులు రాకపోకల సమయంలో బురద చిల్లి ప్రయాణికులపై పడుతుందని,ఎండాకాలంలో దుమ్ముదుళి కళ్ళల్లో పడుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని,పాలకుర్తి బస్టాండ్ నుంచి తోరూరు, కొడకండ్ల, తిరుమలగిరి, హనుమకొండ, మొండ్రాయి, వరంగల్,దేవరపుల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని,ముఖ్యంగా పాలకుర్తి తిరుమలగిరి, మొండ్రాయి,పాలకుర్తి, కొడకండ్ల, పాలకుర్తి,తోరూర్ రోడ్లలో అదనపు బస్సు టిప్పులు నడిపించాలని,
జనగాం నుండి పాలకుర్తి కి రాత్రి 8:30 దాటితే బస్సులు లేవని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,బస్టాండ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని,గతంలో రోడ్డు విస్తరణ జరగడంతో బస్టాండ్ లోపలి రహదారులు క్రిందికి పడిపోయాయని, బస్సులు లోపలికి వెళ్లడం బయటికి రావడం సమయంలో డ్రైనేజీ డివైడర్లు అడ్డంకిగా మారుతున్నాయని,అందువల్ల బస్టాండులోని రోడ్లను పైకి లేపి సీసీ రోడ్లతో మరమ్మతులు చేపట్టాలని, ప్రభుత్వం,సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ సమస్యలను పరిష్కరించాli.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య,ముస్కు ఇంద్రారెడ్డి, నాయకులు బి వెంకన్న, కే సోమయ్య, పి బాలయ్య, కే పద్మ,జి లక్ష్మీ, కే వెన్నెల, బి రేణుక, డి చంద్రమ్మ, జి బుచ్చమ్మ, కే ఎల్లమ్మ, ఈ లచ్చమ్మ, మైసమ్మ, యాక లక్ష్మి, మహేశ్వరి, యాకమ్మ, ఎం నరేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




