Jangaon: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బీఆర్‌ఎస్

Jangaon: జనగామలో టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ ప్రెస్ మీట్. ఫామ్‌హౌస్ శుద్ధీకరణ ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 11 Sept 2026 6:25 PM IST
Jangaon
X

Jangaon: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బీఆర్‌ఎస్

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దళితుల ఆత్మగౌరవం సామాజిక న్యాయం మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో ముందంజలో ఉంటుందని స్పష్టం చేస్తూ

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ బోర్డుల్లో సముచిత పదవులు కేటాయించి తగిన ప్రాధాన్యత కల్పిస్తోందని కానీ గత బీఆర్‌ఎస్ పాలనలో మాత్రం దళిత ప్రజాప్రతినిధులకు ఎటువంటి గౌరవం దక్కలేదని తీవ్రంగా విమర్శించారు.

అంతేకాకుండా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోకి దళిత నాయకులు వెళ్లొచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుద్ధీకరణ చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకవేళ అదే నిజమైతే అది ముమ్మాటికీ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అవమానకర చర్య అని ఆయన మండిపడ్డారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON