Jangaon: తపస్పల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

Jangaon: చేర్యాల, కొమురవెల్లి మండలాల చెరువులు నింపాలని తపస్పల్లి రిజర్వాయర్ వద్ద ఇరిగేషన్ డీఈకి కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి. రేపు నీటి విడుదలకు అధికారి హామీ.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 19 Aug 2026 5:30 PM IST
Jangaon
X

Jangaon: తపస్పల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

జనగామ: జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తపాస్ పల్లి రిజర్వాయర్నుకాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు చుట్టుపక్కల గ్రామాల స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజర్వాయర్లో ఉన్న నీటిని కొమురవెల్లి చేర్యాల మండలాల పరిధిలోని చెరువులు కుంటలకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను కాంగ్రెస్ నాయకులు కోరారు

అదేవిధంగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు ఇరిగేషన్ డిఈ గారితో ఫోన్ చేసి చుట్టు ప్రక్క గ్రామాలలో అనుకున్న స్థాయిలో వర్షాలు కురువక పోవడం తోరైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులకు అండగా నిలవాలని కోరారు దీనికి స్పందించిన డిఈ రేపు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల కొమురవెల్లి.దూల్మిట్ట మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story