Jangaon: జనగామ ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్

Jangaon: జనగామ కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రాజకీయ పార్టీల సమక్షంలో సీసీ కెమెరాలు, భద్రత పరిశీలన.

MD AHMAD PASHA, JANGAON
Published on: 7 Sept 2026 8:35 PM IST
Jangaon
X

Jangaon: జనగామ ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్

జనగామ జిల్లా: సోమవారం, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో గల ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు.

ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి రవి, బీజేపీ పార్టీ ప్రతినిధి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story