Jangaon: దేవరుప్పులలో ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు, రక్తదానం
Jangaon: దేవరుప్పుల పీహెచ్‌సీలో పీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.
Jangaon: దేవరుప్పులలో ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు, రక్తదానం
జనగామ: పీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవరుప్పుల మండల అధ్యక్షులు దావెర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో , కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకొని ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రక్తదానం చేసిన దాతలకు అనంతరం సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.
రక్తదానం చేసిన వారి వివరాలు:
1. కె. గణేష్
2. వై. నరేంద్ర రెడ్డి
3. ఎల్. రామ్ నాయక్
4. ఎం. చంద్రశేఖర్
5. ఎం. వెంకటేష్
6. బి. యకన్న
7. కె. రవీందర్
8. ఎం.డి. షాజహాన్
9. బి. భాస్కర్
10. ఎం. సుమన్
11. కె. అనిల్
12. బి. నాగరాజు
13. ఆర్. యకయ్య
14. బి. వెంకన్న
15. కె. రామ్
16. ఎన్. పవన్ కళ్యాణ్
17. ఎ. ప్రశాంత్
18. బి. మోక్షజ్ఞ
19. డి. ప్రశాంత్
20. పి. కిరణ్
21. ఆర్. సోమయ్య
22. బి. సందీప్
23. డి. మహేష్
24. బషీపాక కుమార్
25. ఎన్. ఉదయ్ కుమార్
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అంకితభావంతో సేవలందిస్తున్న శ్రీమతి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి సేవలను కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ముందుండి పనిచేస్తున్న ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరింత కాలం ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సెల్‌ల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.




