Jangaon: జనగామ జిల్లాలో విషాదం.. పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి!
Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Jangaon: జనగామ జిల్లాలో విషాదం.. పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి!
Jangaon: బచ్చన్నపేట మండలం, పాము కాటు తో చిన్నారి మృతి చెందిన సంఘటన నారాయణపురం గ్రామంలో జరిగింది. రాత్రి ఇంటి ఆవరణలో తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న చిన్నారి మధుస్మిత ను పాము కాటేసింది. వెంటనే పాపా తల్లిదండ్రులకు తెలియజేయడంతో జనగామ, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించగా కన్ను మూసింది.
ఆడుతు, పాడుతు మంచిగా చదువుకుంటూ ఉన్న పాప చనిపోవడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు(ఒగ్గు మహేష్) తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ,
ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ భావోద్వేగభరితమై సర్పంచ్ పరిదే స్వప్న శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, మాసాపేట రవీందర్ రెడ్డి, జంగిటి నరేష్, మిగతా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.




