Jangaon: పంటల సాగులో మెలకువలు సూచించిన శాస్త్రవేత్తలు
Jangaon: జనగామ జిల్లాలో ఎల్ నినో ప్రభావంపై పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సూచనలు చేశారు.
Jangaon: పంటల సాగులో మెలకువలు సూచించిన శాస్త్రవేత్తలు
జనగామ: జనగామ జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాలను మార్చుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. శనివారం వరంగల్ జిల్లాలోని ఘనపూర్, జఫర్గడ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం రైతులలో ప్రత్యక్షంగా మాట్లాడి పంటల నిర్వహణపై పలు కీలక సూచనలు చేసింది.
జనగామ జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వి. రమ్య, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, వరంగల్ శాస్తవేత్త డాక్టర్. పి. గోన్యనాయక్, మండల వ్యవసాయ అధికారి శ్రీ. చంద్రన్ కుమార్ లతో కూడిన బృందం వరి, ప్రత్తి, మొక్కజొన్న, వేరుగేనగ, నువ్వులు, కందులు మరియు వివిధ రకాల కూరగాయ పంటలను పరిశీలించి రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందించారు.
పంటలలో ఎక్కువగా కలుపు మొక్కలను, జింక్ లోపాలు కనిపించాయి మరియు ప్రత్తిలో రసం పిల్చే పురుగులలు, వైరస్ తెగుళ్ళ ఉధ్రృతి ఎక్కువగా ఉంది. రసం పీల్చే పురుగుల యాజమాన్యం కోరకు వేప నూనె 1500 పీ పీ యఎం @ 5 మి.లి. లీటర్ నీటికి మరియు అసిఫేట్ 1.5 గ్రా లేదా ఫ్లోనికేమిడ్ 0.3 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
వరిలో వచ్చే కండం తొలుచు పురుగు నివారణకు కోరాజెన్ @ 0.3 మి.లి. లీటర్ నీటికి మరియు కంది పంటను ఆశించే గడ్డిమోతు వైరస్ తెగుళ్ళ నివారణకు సైరోమెసిఫిన్ @ 1 మి.లి. లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. బెట్టకు గురైన మొక్కలలో యూరియా ద్రావణం శాతం, మల్టీ కే ద్రావణం పిచికారీ చేయాలి.
రైతులు వాతావరణ పరిస్థితులను ద్రష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే పంట నష్టాలను తగ్గించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీమతి శ్వేత, శ్రీమతి అనిత మరియు చాగల్, రాఘవపూర్, థీగారం సూరారం గ్రామరైతులు పాల్గొన్నారు.




