Jangaon: ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన 2005-06 బ్యాచ్ మిత్రులు

Jangaon: జనగామ జిల్లా పెంబర్తిలో 2005-06 పదో తరగతి బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

MD AHMAD PASHA, JANGAON
Published on: 6 Sept 2026 6:26 PM IST
Jangaon
X

Jangaon: ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన 2005-06 బ్యాచ్ మిత్రులు

Jangaon: జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలోని బీఎంఆర్ గార్డెన్‌లో 2005–06 పదో తరగతి బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 20వ సంవత్సరాల తర్వాత పాత మిత్రులంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో గార్డెన్‌లో సందడి నెలకొంది.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాల రోజుల అనుభవాలను పంచుకుంటూ, తమ స్నేహబంధాన్ని మరింత బలపర్చుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం అందరిలోనూ ఆనందాన్ని నింపింది. ఉపాధ్యాయులు ఆనంద్ కుమార్ సంధ్య స్వర్ణలత శేషు కుమార్ పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story