Bayyaram: ఏజెన్సీ గౌడులకు వృత్తి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి!
Bayyaram: ఏజెన్సీ ప్రాంతాల్లోని గౌడులకు వృత్తి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 'తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడు కుల పరిరక్షణ కమిటీ' డిమాండ్ చేసింది.
Bayyaram: ఏజెన్సీ గౌడులకు వృత్తి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడు కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ నరాటి వెంకన్న,గౌరవ సలహాదారు లు కొత్త వెంకటేశ్వర్లు. బస్వ వెంకటేశ్వర్లు విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడు కులస్తులకు వృత్తి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కోరారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ కింద గీత కార్మికులకు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని. గౌడు కులస్తులకు పెన్షన్ల అవకాశం కల్పించిందని,దీనికిగాను గౌడు కులస్తులు సంబంధిత శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలని నిబంధన లో పేర్కొన్నారనీ తెలిపారు.ఏజెన్సీ ప్రాంతంలో 2000 ల సంవత్సరం నుండి కల్లు గీత కార్మిక సొసైటీల రెన్యువల్ చేయటం లేదనీ అందువల్ల 2000 వరకు సహకార సంఘాల సభ్యులుగా గీత వృత్తిలో కొనసాగిన గౌడు కులస్తులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు.
ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని గౌడు కులస్తులు ప్రభుత్వం కల్పిస్తున్న పదకాలకు అనేక విధాలుగా నిరాదరణ కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ సంక్షేమపథకాలు ఏజెన్సీ ప్రాంతాల్లో వారికి అందడం లేదని తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కోసం సంబంధి త అధికారులు 2000 సంవత్సరం వరకు కొనసాగిన సొసైటీల సబ్యులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వారు కోరారు.




