Hanamkonda: అభ్యుదయ కవయిత్రి అనిశెట్టి రజిత ప్రథమ వర్ధంతి వేడుకలు!

Hanamkonda: అభ్యుదయ కవయిత్రి అనిశెట్టి రజిత ప్రథమ వర్ధంతి సందర్భంగా హన్మకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద వరంగల్ కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 11 Aug 2026 10:55 PM IST
Hanamkonda
X

Hanamkonda: అభ్యుదయ కవయిత్రి అనిశెట్టి రజిత ప్రథమ వర్ధంతి వేడుకలు!

హనుమకొండ: అభ్యుదయ కవయిత్రి, సామాజిక ఉద్యమకారిణి, ప్రజా ఉద్యమాల్లో, స్త్రీవాద పోరాటాల్లో నిరంతరం క్రియాశీలకంగా నిలిచిన చైతన్యశీలి కామ్రెడ్ అనిశెట్టి రజిత ప్రథమ వర్థంతి సందర్భంగా వరంగల్ కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా సామాజిక కవి పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికీ ఊపిరిగా నిలబడడంతోపాటు, సమాజంలోని అనేక వేదికలపై ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరిగినా ఎవరికీ భయపడకుండా సూటిగా, నిష్కపటంగా నిలదీసే ధైర్యం ఆమె సొంతమని, అనేక కవితా సంపుటాలను రచించడమే కాకుండా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలుగా, రుద్రమ ప్రచురణ కర్తగా, వివిధ సంకలనాల ద్వారా ఎందరో రచయిత్రుల గొంతుకను సమాజానికి వినిపించారని.

నిస్సహాయులైన మహిళలకు, అనాథలకు, మూగజీవాలకు ఎంతో చేయూతనదించడమే కాకుండా మరణానంతరం కూడా తన శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసి ఆదర్శంగా నిలిచారని, ప్రతీ ఒక్కరు ఆమె స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని పెర్కొన్నారు.

కార్యక్రమంలో కవులు, రజిత అభిమానులు ఆచార్య బన్న ఐలయ్య, నిధి, వల్లంపట్ల నాగేశ్వరరావు, బిల్ల మహేందర్, డాక్టర్ బండారు సుజాత, ఇందిర, రమాదేవి, సింగరాజు రమాదేవి, బూర బిక్షపతి, ఉదయ్ సింగ్, వల్సపైడీ, బాస్కుల శోభ, పల్లేరు వీరస్వామి, రాం బ్రహ్మచారి, సుమిత్రా దేవి, పిట్ట సాంబయ్య, ఠాగూర్ వంశీ, భగత్, భుజంగరావు , నరసయ్య, మర్రి మహేష్! రాచర్ల బాలరాజు తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story