Mahabubabad: హెచ్ఎంటివి ఇంపాక్ట్.. రంగంలోకి విద్యాశాఖ అధికారులు
Mahabubabad: గుండెంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమస్యలపై ‘హెచ్ఎంటివి’ (hmtv) ప్రసారం చేసిన కథనానికి విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించారు.
Mahabubabad: హెచ్ఎంటివి ఇంపాక్ట్.. రంగంలోకి విద్యాశాఖ అధికారులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ ‘హెచ్ఎంటివి’ (hmtv) ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి విద్యా అధికారులు తక్షణమే స్పందించారు. ఈ కథనంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు.
గుండెంగా గ్రామంలోని యూపీఎస్ (UPS) పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి (MEO), సుజాతా, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు షాహిద్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) ఎం. రాజు గారు మరియు ఎన్. శ్రీనివాస్ గారు సంయుక్తంగా సందర్శించారు.
ఈ నెల ఆఖరి కల్లా వంటగది నిర్మాణం
పాఠశాల సందర్శనలో భాగంగా అధికారులు విద్యార్థుల సమస్యలను, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. అనంతరం పాఠశాల వంటగది నిర్మాణ విషయమై స్థానిక గ్రామస్తులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ నెల చివరి నాటికి వంటగది ఏర్పాటును పూర్తి చేసి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బడిబాట' కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని, వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఉపాధ్యాయ బృందం తెలిపింది. గుండెంగ గ్రామ సర్పంచ్ బొడరాజి తమ గ్రామాలలో ప్రైవేటు బస్సులు రావొద్దు అంటూ బోర్డులను ఏర్పాటు చేసి ప్రైవేటు బస్సులను రానీయకుండా అడ్డుకుంటున్నారు అని ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
hmtv కి కృతజ్ఞతలు..
విద్యార్థుల సమస్యలపై స్పందించి కథనాన్ని ప్రసారం చేసిన ‘హెచ్ఎంటివి’ యాజమాన్యానికి, తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.




