Bhupalpally: ర్యాలీలతో భూపాలపల్లిలో హైటెన్షన్.. పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ ఆగ్రహం!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలు ఒకే సమయంలో జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Bhupalpally: ర్యాలీలతో భూపాలపల్లిలో హైటెన్షన్.. పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ ఆగ్రహం!
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలు ఒకే సమయంలో సాగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు కేటాయించిన సమయం ముగిసినా ర్యాలీ కొనసాగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
ఇదే సమయంలో ర్యాలీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తమకు కేటాయించిన సమయం ఉన్నప్పటికీ వాహనాలను ఎందుకు నిలిపివేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు .
దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటామాటా పెరిగి.. ఇరువర్గాల కార్యకర్తలు ఎదురెదురుగా చేరడంతో కొద్దిసేపు భూపాలపల్లి జిల్లా కేంద్రం హైటెన్షన్‌గా మారింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేసారు .
ఒకే సమయంలో రెండు పార్టీల ర్యాలీలకు అనుమతులు.. సమన్వయం లోపించిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు భూపాలపల్లిలో చర్చనీయాంశంగా మారాయి.




