Mahabubabad: మహబూబాబాద్‌లో కుండపోత వర్షం: తెగిపోయిన డైవర్షన్ రోడ్డు!

Mahabubabad: ఉపరితల ఆవర్తనంతో మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నెల్లికుదురు వద్ద డైవర్షన్ రోడ్డు తెగిపోయి తొర్రూరు హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.

A.Rajkumar, Mahabubabad
Published on: 13 Sept 2026 2:21 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో కుండపోత వర్షం: తెగిపోయిన డైవర్షన్ రోడ్డు!

Mahabubabad: ఉపరితల ఆవర్తనం ప్రబావం తో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల రహదారుల పై నుంచి వర్షపు ప్రవహించటం తో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

నెల్లికుదురు మండల కేంద్రం శివారు లో తొర్రూరు... మహబూబాబాద్ ప్రధాన రహదారి పై వరద ప్రవాహం తో డైవర్షన్ రోడ్డు తెగిపోవడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను ఇతర మార్గాల గుండా పంపించారు.

మహబూబాబాద్ ప్రధాన రహదారి పై నుంచి వరద నీరు ప్రవహించడం తో సుమారు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad