Hanumakonda: బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శేషాద్రి
Hanumakonda: హన్మకొండ జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్ శేషాద్రి తనిఖీ చేశారు. నిబంధనలు పాటించాలని, మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.
Hanumakonda: బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శేషాద్రి
హనుమకొండ: మంగళవారం హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి తనిఖీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ కమిటీ బృందంతో కలిసి తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా సాయి సేవా ట్రస్ట్, ఒయాసిస్ ట్రస్ట్, మల్లికాంబా మనో వికాస బాలురు బాలికల కేంద్రం, రీచ్, కేర్ అండ్ షెల్టర్ ప్రత్యేక దత్తత కేంద్రం (మహిళాభి శిశు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ శిశు గృహ)లను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు కనీస ప్రమాణాలు పాటించాలని, ముఖ్యంగా భవనాలకు సంబంధించిన సౌండ్నెస్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లను కలిగి ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటేషన్, వాటర్ ప్యూరిఫికేశన్ సంబంధిత, కిచెన్, స్టోర్ , విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు,
ఈ సందర్భంగా తనిఖీ చేసిన కేంద్రాలలో డార్మెటరీ, వాష్ రూమ్స్, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశీలించారు, రికార్డులను, పిల్లలకు అందిస్తున్న ఆరోగ్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లైసెన్స్ కలిగి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకొనే సంస్థలు తప్పకుండా కనీస ప్రమాణాలు పాటించాలని లేనిచో నిబంధనల మేరకు చర్యలుంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సిహెచ్. అవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కజాంపురం దామోదర్, డాక్టర్ పరికి సుధాకర్, ఇన్చార్జి డిసిపిఓ ఎస్ ప్రవీణ్ కుమార్, జిల్లా తనిఖీ బృందం సభ్యులు సిస్టర్ జెస్సీ సిరియాక్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ హరిత, తదితరులు పాల్గొన్నారు.




