Hanumakonda: హనుమకొండలో ఏఐఎస్ఎఫ్ 90 వసంతాల వేడుకల ఏర్పాట్లు!

Hanumakonda: హనుమకొండలో ఏఐఎస్ఎఫ్ 90 వసంతాల వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్య నేతలు. సెప్టెంబర్ 28 నుంచి కాకతీయ వర్సిటీలో రాష్ట్రస్థాయి మహాసభలు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 12 Sept 2026 1:53 PM IST
Hanumakonda
X

Hanumakonda: హనుమకొండలో ఏఐఎస్ఎఫ్ 90 వసంతాల వేడుకల ఏర్పాట్లు!

Hanumakonda: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) తెలంగాణ రాష్ట్ర 90 వసంతాల ముగింపు వార్షికోత్సవాలు సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండ జిల్లా కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో, వార్షికోత్సవాల ఏర్పాట్లను ఏఐఎస్ఎఫ్ నాయకులు పరిశీలించారు.

మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మొదటిరోజు కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో బహిరంగ సభ, అనంతరం రెండు రోజులపాటు బాలవికాస మీటింగ్ హాల్‌లో రాష్ట్రస్థాయి మహాసభలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాజరయ్యే డెలిగేట్లకు కల్పిస్తున్న వసతి, భోజన సదుపాయాలతో పాటు సభా వేదిక, మీటింగ్ హాల్, డైనింగ్ హాల్ తదితర ఏర్పాట్లను నాయకులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ ఏర్పాట్లను ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు కర్రే బిక్షపతి, ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. మణికంఠ రెడ్డి పరిశీలించి, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వార్షికోత్సవాల నిర్వహణకు సంబంధించిన సభా వేదిక, డెలిగేట్ల వసతి, భోజన ఏర్పాట్లు, సమావేశాల నిర్వహణ తదితర అంశాలను ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్, జిల్లా కార్యదర్శి భాషాబోయిన సంతోష్ నాయకులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు దొడ్డి పార్థసారథి, జిల్లా కార్యదర్శి శరత్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్, వేల్పుల చరణ్, శ్రీపతి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సంతోష్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ విద్యావేత్తలు, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మరియు 600 మంది డెలిగేట్స్ పాల్గొననున్నట్లు వారు తెలిపారు.

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం“చదువు – పోరాడు” అనే నినాదంతో జరిగే ఏఐఎస్ఎఫ్ 90 వసంతాల ముగింపు వార్షికోత్సవాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

విప్లవ అభినందనలతో

జిల్లా అధ్యక్షులు

ఊట్కూరి ప్రణీత్ గౌడ్

86867 27298.

జిల్లా కార్యదర్శి

భాషబోయిన సంతోష్

8106551545

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.