Hanamkonda: తల్లి మృతి చెందిన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కుమారుడు మృతి
Hanamkonda: హనుమకొండ జిల్లా ఐనవోలులో తల్లి మృతి చెందిన తీవ్ర ఆందోళనతో గంటల వ్యవధిలోనే కుమారుడు రవి గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది.
Hanamkonda: తల్లి మృతి చెందిన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కుమారుడు మృతి
హనుమకొండ: తల్లి మృతి చెందిన గంటల వ్యవధిలోనే కుమారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఐనవోలు మండల కేంద్రానికి చెందిన కొండేటి మల్లికాంబ (68) అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు.
తల్లి మృతితో తీవ్ర ఆందోళనకు గురైన కుమారుడు రవి(38) శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇంటి వద్దే గుండె ఆగి మృతి చెందాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Next Story




