Hanamkonda: పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత బోనాల ఫ్లెక్సీల వివాదంలో అరెస్ట్‌లు!

Hanamkonda: హనుమకొండ రాగన్నదర్వాజ బోనాల ఫ్లెక్సీల వివాదం. సీఐ చర్యలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆగ్రహం. పీఎస్‌కు చేరుకున్న బీజేపీ నాయకురాలు రావు పద్మారెడ్డి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 Aug 2026 3:11 PM IST
Hanamkonda
X

Hanamkonda: పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత బోనాల ఫ్లెక్సీల వివాదంలో అరెస్ట్‌లు!

Hanamkonda: రాగన్నదర్వాజ బోనాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది.

పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను హనుమకొండ సీఐ (CI) అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా, నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న బిజెపి నాయకురాలు శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు వెంటనే హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని, నాయకుల అరెస్టులను నిరసిస్తూ ఆమె పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

పండుగ వాతావరణంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని, అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

శ్రీమతి రావు పద్మ రెడ్డి రాకతో పాటు, పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story