Hanamkonda: బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు!

Hanamkonda: డిసిసి భవన్‌లో కాంగ్రెస్ మీడియా సమావేశం. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం.

M PRABHAKAR, PARAKAL
Published on: 3 Sept 2026 10:00 AM IST
Hanamkonda
X

Hanamkonda: బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు!

Hanamkonda: బుధవారం హనుమకొండ లోని డిసిసి భవన్ యందు నిర్వహించిన పత్రికా మీడియా మిత్రుల సమావేశంలో వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య , ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య , హనుమకొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి, ఎం డి ఆయుబ్ తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని సర్వం దోచుకతిని, దొంగే ఎదుటివాన్ని దొంగ అన్నట్టుగా వారు ప్రవర్తించే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వారికి ప్రజలు ఇచ్చిన అవకాశాలు ఎన్ని వాగ్దానాలు, ఇంతవరకు నెరవేర్చామని తెలుసుకోవాలి అన్నారు.

కెసిఆర్ ఉద్యమ సమయంలో నుండి 2023 వరకు ప్రజలను మభ్యపెడుతూ, ప్రతిపక్షాల గొంతు నొక్కారని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ప్రశ్నించే గొంతులు ఉంటే అక్కడ వారిని టిఆర్ఎస్ నాయకులు తొక్కేసారని,మాయమాటలతో అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాలని తెలిపారు.బిఆర్ఎస్ నాయకులు కాలేశ్వరం ప్రాజెక్టుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

అలాగే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మాట తప్పిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు.ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బి ఆర్ ఎస్ ది అని,దేశ ఆర్థిక వృద్ధికి తెలంగాణ 5.4 శాతం వరకు సహకారం అందిస్తోంది.

పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, 2014లో 87.57 లక్షల కార్డులు ఉండగా, 2.83 లక్షల కార్డులు తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15.46 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, మొత్తంగా 1 కోటి 6 లక్షల రేషన్ కార్డులు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు,నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, KG నుంచి PG వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ నాయకుల అహంకారానికి, అవినీతికి, నియంతృత్వ ధోరణులకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడి కాంగ్రెస్ ప్రజా పాలనకు పట్టం కట్టారని అన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ పరిమితి 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు, నూతన రేషన్ కార్డులు, తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నాం అన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story