Hanamkonda: ABC ఫ్యామిలీ సెలూన్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య

Hanamkonda: హనుమకొండ బాలసముద్రంలో ABC ఫ్యామిలీ సెలూన్ నూతన బ్రాంచ్‌ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం ప్రారంభించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 26 Aug 2026 9:49 PM IST
Hanamkonda
X

Hanamkonda: ABC ఫ్యామిలీ సెలూన్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య

హనుమకొండ: బాలసముద్రంలోని ABC ఫ్యామిలీ సెలూన్ నూతన బ్రాంచ్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్‌ను సందర్శించిన ఎంపీ డా. కడియం కావ్య గారు నిర్వాహకులు ప్రవీణ్, ప్రశాంత్‌లను అభినందించారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గారు మీడియాతో మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమైన ABC ఫ్యామిలీ సెలూన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

స్థానికంగా నూతన వ్యాపారాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు తెలిపారు. ABC ఫ్యామిలీ సెలూన్ నిర్వాహకులు ప్రవీణ్, ప్రశాంత్ మరింత అభివృద్ధి సాధించాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెలూన్ సిబ్బంది, నిర్వాహకుల కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story