Hanamkonda: ఏకశిలా పార్కులో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!

Hanamkonda: హనుమకొండ ఏకశిలా పార్కులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి,GWMC కమిషనర్ వెంకన్న నివాళులర్పించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 6 Aug 2026 4:46 PM IST
Hanamkonda
X

Hanamkonda: ఏకశిలా పార్కులో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!

ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి ఏకశిలా పార్కులో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి, జిడబ్ల్యుఎంసీ కమిషనర్ వెంకన్న

హనుమకొండ: ఆగష్టు 6 తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతని గురువారం ఘనంగా నిర్వహించారు.

హనుమకొండ ఏకశిలా పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) శేషాద్రి, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, బల్దియా సి హెచ్ ఓ లాక్ష్మారెడ్డి, రెవెన్యూ మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, వాకర్స్, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story