Hanamkonda: వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష

Hanamkonda: హనుమకొండ కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష నిర్వహించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 Sept 2026 8:02 PM IST
Hanamkonda
X

Hanamkonda: వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష

హనుమకొండ: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల అమలుతీరు, గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న సిజేరియన్ కేసులు,తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం

ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉండే గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలను నిర్వహించడంపై వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలు లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల అమలుతీరు, గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న సిజేరియన్ కేసులు, తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సేవల్లో జిల్లా ముందంజలో నిలవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది మాతా శిశు సంరక్షణ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు.

అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న సిజేరియన్ ప్రసవాలపై దృష్టి సారించి ఆడిట్ నిర్వహించాలన్నారు. సిజేరియన్ కేసులు ఎక్కువ జరుగుతున్న ప్రైవేట్ ఆసుపత్రులను తరచుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. ఇమ్యునైజేషన్ పటిష్టంగా జరగాలన్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్ పటిష్టంగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.

ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో క్షేత్రస్థాయిలో విస్తృత స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్య శిబిరాలను ఎక్కువగా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, డీఐవో డాక్టర్ కృష్ణారావు, అడిషనల్ డీఎంహెచ్ వో డాక్టర్ మదన్ మోహన్ రావు, ఎన్సీడీ అధికారి డాక్టర్ మురళి, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ రజిత, డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ఐడీఎస్పీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story