Gudur: గూడూరులో పోలీసుల బైక్ ర్యాలీ: హెల్మెట్ ఫ్యాషన్ కాదు ప్రాణరక్షణ!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ. సిఐ వినయ్ కుమార్, ఎస్సై గిరిధర్ రెడ్డిల పిలుపు.
Gudur: గూడూరులో పోలీసుల బైక్ ర్యాలీ: హెల్మెట్ ఫ్యాషన్ కాదు ప్రాణరక్షణ!
Gudur: గూడూరు జులై 13(hmtv):-మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ ప్రాధాన్యతను గుర్తించాలని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో సోమవారం ఒక ప్రత్యేక హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గూడూరు సిఐ వినయ్ కుమార్, ఎస్సై గిరిధర్ రెడ్డి లు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలామంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే తలలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ఫ్యాషన్ కోసం కాదు, ప్రాణ రక్షణ కోసమని గుర్తుంచుకోవాలన్నారు.
ఎస్సై గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, వాహనదారులు పోలీసుల తనిఖీల కోసమో, ఫైన్ల కోసమో కాకుండా తమ కుటుంబాల క్షేమం కోసం స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు.
మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ బైక్ ర్యాలీలో స్థానిక యువకులు, వాహనదారులు, మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హెల్మెట్లు ధరించి పాల్గొన్నారు. "హెల్మెట్ ధరించండి - ప్రాణాలను కాపాడుకోండి" అంటూ సాగిన ఈ ర్యాలీ స్థానికుల్లో ఎంతగానో అవగాహన కల్పించింది.




