Gudur: బడిబాటలో గవర్నమెంట్ టీచర్ ఎమోషనల్ స్పీచ్..

Gudur: గూడూరు మండలం పాటిమీది గూడెం ప్రభుత్వ పాఠశాల టీచర్ డాక్టర్ వి.గోపీనాథ్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడి ప్రాధాన్యతను వివరించారు.

B NARASIMHA, GUDUR
Published on: 5 Jun 2026 12:41 PM IST
Gudur
X

Gudur: బడిబాటలో గవర్నమెంట్ టీచర్ ఎమోషనల్ స్పీచ్..

గూడూరు: నేను ప్రభుత్వ టీచర్ ని -మీ పిల్లలకు అక్షరం నేర్పడేమే కాదు.. వ్యక్తిత్వం నేర్పుతా.. విలువలు నేర్పుతా.. జీవిత పాఠాన్ని నేర్పుతా.. నా బడికి పంపండి మీ బిడ్డను నాకు ఇవ్వండి వాళ్లను ఈ దేశానికి గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దుతా డాక్టర్ గోపీనాథ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లో ఉన్న పాటిమీది గూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ వి గోపీనాథ్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆ ఊరిలో ఇంటింటికి తిరుగుతూ తల్లితండ్రులను కలుసుకుంటూ వారి బాగోగులను పంచుకుంటూ మీ బిడ్డ భవిష్యత్తుకు వేసే తొలి అడుగు ప్రభుత్వ బడి అని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉచిత గా చదువు పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం డిజిటల్ క్లాసులు ఇంగ్లీష్ మీడియం లో తరగతులు బోధిస్తున్నామని.

ఇంటి దగ్గరే బడి ఉచితంగా చదువు ఉజ్వలంగా భవిష్యత్తు ఉందని అంటూ బడి అంటే భయం కాదు భరోసా చదువు అంటే భారం కాదు వెలుగు రండి ప్రభుత్వ బడికి రండి కలిసి చదువుదాం రండి ఆడుతూ పాడుతూ చదువుకుందాం అని నినదించారు.వారి పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని యొక్క తండ్రి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని ప్రగాడ సానుభూతిని తెలియజేసి వారి పిల్లలకు అండగా నేను ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది.

ఒక్క విద్యార్థి భవిష్యత్తు మారితే అతని యొక్క కుటుంబం తలరాత మారుతుందని తల్లితండ్రులకు హితబోధన చేశారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story