Jangaon: సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గద్వాల విజయలక్ష్మి!
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Jangaon: సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గద్వాల విజయలక్ష్మి!
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి పూజలు నిర్వహించారు.. ఆమెతో పాటు మహిళ కమిషన్ మెంబర్ సభ్యులు కూడా ఆలయాన్ని సందర్శించారు..స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయంలోని శివకేశవుల చారిత్రక గుహల విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.. ఆలయానికి విచ్చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి తో పాటు మెంబర్ సభ్యులకు ఆలయ అధికారులు,అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి చిత్రపటంతో పాటు పట్టు వస్త్రాలను కమిషన్ చైర్ పర్సన్ కు అందజేశారు.. కమిషన్ సభ్యులకు అర్చకులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలనించరు..అనంతరం పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలోనీ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.




