Mahabubabad: హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతాం బీజేపీ

Mahabubabad: నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 16 July 2026 9:02 PM IST
Mahabubabad
X

Mahabubabad: హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతాం బీజేపీ

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్ లో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో, ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ ని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు.

రాబోయే ఎన్నికలలో కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యచరణ ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల కరప్షన్ లు కమిషన్ లకు విసుగత్తినటువంటి ప్రజలు మార్పుగా బీజేపీ ని కోరుకుంటున్నరన్నారు.ప్రతి బూత్ లలో కొనసాగే సర్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కి సంబంధించిన వారి ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బయటి నుంచి వచ్చే రోహిoగాలు ఎంఐఎం కు సంబంధించినటువంటి దొంగ ఓట్లు డబల్ ఓట్లు ఉన్నాయో వాటిన్నింటిని తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ముందుకు వెళ్తున్నాం అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి జాతీయ రహదారులు విమానాశ్రయాలనుతీసుకచ్చిన ఘనత ప్రధానమంత్రి మోడీకే దక్కిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతరాం నాయక్, రాష్ట్ర నేతలు రాం చందర్ రావు, లింగాల సుధీర్ రెడ్డి, గడ్డం అశోక్, గుగులోత్ శంకర్ నాయక్ హిందూ భారతిలు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story