Mahabubabad: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా!
Mahabubabad: తొర్రూరు మండలంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
Mahabubabad: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా!
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అరిపిరాల శివారు కోటిలింగాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన వైఫల్యం పై టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన కార్యక్రమం లో భాగంగా ఆయిల్ ఫామ్ కార్యాలయంలో రైతులతో ధర్నా నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని,తక్షణమే ఎస్సారెస్పీ కాలువలో నీరు విడుదల చేయాలి. ప్రతాప్ ప్రభుత్వ మంజూరు అయిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి మూడేళ్లు గడిచిన ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని,
నెల రోజుల్లో ఫ్యాక్టరీ పనులు ప్రారంభించక పోతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభిస్తామని, స్థానికులు 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.




