Jangaon: చేపల కోసం రైతు పొట్టకొడుతున్నారా? మండలగూడెంలో సంచలన ఆరోపణలు!
Jangaon: జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం మండలగూడెంలో అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారంటూ రైతుల ఆందోళన!
Jangaon: చేపల కోసం రైతు పొట్టకొడుతున్నారా? మండలగూడెంలో సంచలన ఆరోపణలు!
జనగామ జిల్లా: రఘునాథ్ పల్లి మండలం మండల గూడెంలో చేపలు పట్టడానికి తూమును తీసి గత నెల రోజుల నుంచి చెరువు నీళ్లను బయటికి వదులుతున్నారని స్థానికులు ఆరోపించారు.
ఇదివరకే రెండుసార్లు ఇలా నీళ్లను వదిలి చేపలు పట్టారని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. తూము వద్ద మట్టి బస్తాలు వేసి నీరు పోకుండా చేసినా కూడా మళ్లీ రెండు మూడు రోజుల తర్వాత అదే విధంగా తూము తీసి చేపలు పడుతున్నారు.
పంట పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని అసలే వర్షాలు లేక భూగర్భ జలాలు ఎండిపోయి, చెరువులో ఉన్న నీరు కూడా తొలగించి చేపలు పట్టడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులో నీరు లేక కూడా ఉన్న చేపలు చనిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటి వృధాను అరికట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు.




